Thursday, July 4, 2013

వెలుగులోకి కృష్ణమయ్య కీర్తనలు - కృష్ణమయ్య ప్రాజెక్టు అధ్యక్షులు పి. ఆనందగజపతిరాజు a news item published in Andhrapabha dailydt Sun, 4 Jul 2010, IST

విజయనగరం 

వెలుగులోకి కృష్ణమయ్య కీర్తనలు

కెఎన్‌ఎన్‌  -   Sun, 4 Jul 2010, IST

  • కృష్ణమయ్య ప్రాజెక్టు అధ్యక్షులు పి. ఆనందగజపతిరాజు
విజయనగరం (కలెక్టరేట్‌), జూలై 3 (కెఎన్‌ఎన్‌) : తిరుమల వెంకటేశ్వరుని సన్నిధానంలో అన్నమయ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందని దానికి కారణం ఆయన చేసిన సంకీర్తనలేనని అదే విధంగా సింహాచలంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి పరమభక్తుడు, కాంత కృష్ణమాచార్య కూడా నృసింహ స్వామిపై లక్షల సంకీర్తనలు చేశారని అయినా అన్నమయ్య వెలుగులోకి వచ్చాడని, కృష్ణమయ్య కీర్తనలు వెలుగులోనికి రాలేదని ఆయన కీర్తనలు వెలుగులోనికి తెచ్చేందుకు కృష్ణమయ్య ప్రాజెక్టు ద్వారా కృషి చేస్తున్నామని ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు పూసపాటి ఆనందగజపతిరాజు తెలిపారు. ఆయన స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 11వ అవతారుడిగా ఖ్యాతి గాంచిన కాంత కృష్ణమాచార్యులు నృసింహస్వామిని స్తుతిస్తూ, నాలుగు లక్షల సంకీర్తనలు రచించి సంకీర్తనానికి మార్గదర్శకుడయ్యారన్నారు. అటువంటి కృష్ణమయ్య సంకీర్తనలు, జీవితం చీకటిలో ఉండటం దురదృష్టకరమని అభివర్ణించారు. ఆయన తరువాత తరం వారైన అన్నమయ్య, పెద తిరుచానూర్యులకు ప్రాచుర్యం లబించిందన్నారు. అయితే అన్నమయ్యకు వారసులుండటంతో వారి కీర్తనలకు ప్రాచుర్యం లబించిందని, కృష్ణమయ్యకు వారసులు లేకపోవటంతో వీరి కీర్తనలు చీకట్లో మరుగున పడిపోయాయన్నారు. ప్రజలందరికీ కృష్ణమయ్య కీర్తనలు,ఆయన భక్తి తత్వం, తెలుగు వారికి పరిచయం చేయాలనే లక్ష్యంతో కృష్ణమయ్య ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఆనందగజపతి తెలిపారు. గత ఏడాది ఈ ప్రాజెక్టును విశాఖపట్నంలో ప్రారంభించామన్నారు. ప్రస్తతం సుమారు ఏడు శతాబ్దాల తర్వాత సింహాచలం శ్రీ వరాహనరసింహ స్వామి సన్నిధిలో ప్రముఖ గాయకులు, స్వరకర్త వినుకొండ మురళీమోహన్‌, కృష్ణమయ్య కీర్తనలను స్వరపరచి తొలిసారిగా గానం చేసారని చెప్పారు. ఆ విధంగా కృష్ణమయ్య సంకీర్తనలు వెలుగు చూశాయన్నారు. ఈ స్వరపర్చిన కీర్తనలను సీడీల రూపంలో తేవటానికి ప్రాజెక్టు కృషి చేస్తుందని తెలిపారు. మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలచే కృష్ణమయ్య వాంగ్‌మయం కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతీ పౌరుడి పై ఉందని, ఈ ప్రాజెక్టు చేపట్టే కార్యక్రమాలకు ఇతోధికంగా సహాయం చేయమని కోరారు. అలాగే ఆర్ధిక సహాయం చేయాల్సిన వారు ప్రాజెక్ట్‌ సంచాలకులు మురళీమోహన్‌ ...9248468774 నంబరును సంప్రదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు సుధా గజపతి తదితరులు పాల్గొన్నారు.
Pl.view the following links

and also
http://www.cyclopaedia.de/wiki/Sri_Kantha_Krishnamacharyulu